టీటీడీ కళ్యాణ వేదిక అంటే ఏంటి? What Does TTD Kalyana Vedika Mean?
టీటీడీ వారు తిరుమల ఆలయం లో కళ్యాణ వేదిక ను నడిపిస్తున్నారు. ఈ వేదిక హిందూ సంప్రదాయంలో వరుడు వధువుకు కళ్యాణం జరిపించే వేదిక. ఇక్కడ కళ్యాణం చేసుకునే వారు చాలా మంది ఉంటారు, కళ్యాణం ఇక్కడే జరిపించాలి అని మొక్కుకున్న తల్లిదండ్రులు ఇక్కడ వధువుకు వరుడు కి కళ్యాణం చేయిస్తారు. శ్రీవారి సన్నిధి లో కళ్యాణం జరిగితే ఆ స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని అప్పుడు ఆ జంట కలకాలం సంతోషంగా ఉంటారు అని నమ్ముతారు.
టీటీడీ వారు నడిపించే ఈ కళ్యాణ వేదిక లో చాలా మంది కళ్యాణం చేసుకుంటున్నారు. ఈ కల్యాణం శ్రీవారి కల్యాణ మండపం లో జరుగుతున్నాయి. అయితే కళ్యాణం చేసుకునే డేట్ మరియు టైం స్లాట్ వారే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది టీటీడీ వెబ్ సైట్ లో చేసుకోవచ్చు.
తిరుమల కళ్యాణ వేదిక లో పాటించాల్సిన నియమాలు Rules to Follow In Tirumala Kalyana Vedika
తిరుమల కళ్యాణ వేదిక లో కళ్యాణం జరిపించుకోవాలి అంటే తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. అవి:
- వివాహం చేసుకోవాలి అనుకున్న వధువు మరియు వరుడు ఇరువురి కుటుంబాలకు ఒప్పందం అయి ఉండాలి.
- అలాగే వరుడు వయస్సు 21 సంవత్సరాలు పైబడి ఉండాలి మరియు వధువు వయస్సు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి.
- అభ్యర్థులు ఐడెంటిటీ మరియు రెసిడెన్షియల్ ID ప్రూఫ్స్ తీసుకురావాల్సి ఉంటుంది. (ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వంటివి)
- ఒకవేళ అభ్యర్థుల తల్లిదండ్రులు రాలేకపోతే, వారి గార్డియన్స్ కూడా వివాహం లో పాల్గొనవచ్చు. అయితే వధువుతో కానీ వరుడితో కానీ గార్డియన్ కి ఉన్న రిలేషన్ సాక్షాలతో చూపించాలి.
- మీరు రెండు మూడు జంటలకు ఒకే ముహూర్తం లో వివాహం జరిపించాలని అనుకుంటే, వెబ్ సైట్ లో ‘number of marriages’ సంఖ్య నమోదు చేసి జరిపించుకోవచ్చు.
- ఈ వివాహం తర్వాత పెళ్లి జంట తో పాటు మొత్తం ఆరుగురికి స్వామి వారి రూ. 300 ల ప్రత్యేక దర్శనం ఉంటుంది.
- అలాగే వివాహమైన జంటకు పసుపు, కుంకుమ మరియు ప్రసాదం స్వామి వారి ఆశీర్వాదంగా ఇస్తారు.
- అంతే కాక వివాహం జరిగినట్లు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా తీసుకోవచ్చు. ఆ సర్టిఫికెట్ ఆలయానికి సమీపంలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో తీసుకోవచ్చు..
తిరుమల కళ్యాణ వేదిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ Tirumala Kalyana Vedika Registration Procedure
ఇప్పటి వరకు మనం కళ్యాణ వేదిక లో పాటించాల్సిన నియమాలు చూసాం. ఇప్పుడు కళ్యాణ వేదిక లో బుకింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం.
- ముందుగా ttdsevaonline.com వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి ‘E -Kalyana Vedika’ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
- తర్వాత సూచనలు అన్ని ఒకసారి చదువుకుని ‘continue’ బటన్ ప్రెస్ చేయండి
- ఇప్పుడు మీరు వివాహం జరిపించే తేదీ మరియు సమయం సెలెక్ట్ చేసుకుని, వరుడు మరియు వధువు పూర్తి వివరాలు ఇవ్వాలి. తర్వాత ‘continue’ బటన్ ని క్లిక్ చేయండి.
- మీరు ఇచ్చిన వివరాలు మరొక్కసారి వెరిఫై చేసుకుని కంఫర్మ్ చేయండి. మీకు వచ్చిన రిసిప్ట్ ను డౌన్లోడ్ చేసుకోండి.